కరెన్సీ నోట్లతో వైరస్ వ్యాపిస్తుందా ?

కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందా ? అంటే.. అవుననే అంటోంది ఎస్ బీఐ. ఎస్‌బీఐ చేసిన ఓ పరిశోధనలో ఇది వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా, యూకే, కెనడా తరహాలో కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా పాలీమర్నో నోట్లను తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని రీసెర్చ్ బృందం ప్రభుత్వాన్ని కోరింది. అయితే అది ఇప్పటికి ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.

 డిజిటల్ లావాదేవీలు చేస్తే ఈ సమస్యే ఉండదు. కానీ భారత్ లాంటి పెద్ద దేశంలో పూర్తిగా డిజిటల్ లావాదేవీలు అంటే సాధ్యం కాదని చెప్పాలి. కరెన్సీ నోట్లపై మనుషులకు ఇన్‌ఫెక్షన్లు కలిగించే సూక్ష్మజీవులు ఉంటున్నట్లు, వాటి ద్వారా పలు వ్యాధులు వస్తున్నట్లు పరిశోధన బృందం పలు నివేదికలను సైతం చెబుతున్నాయి.