చిరు పిలుపు.. ‘జనతా కర్ఫ్యూ’పాటిద్దాం !

“అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ ని నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవలందిస్తున్న డాక్టర్లకి, నర్సులకి, ఇతర ఆరోగ్య బృందాలని, స్వచ్ఛ కార్మికులకి, పోలీస్ శాఖ వారికి, అలాగే.. ఆయా ప్రభుత్వాలకి హర్షాద్రేకాలు ప్రదర్శిస్తూ.. ధన్యవాదలు చెప్పాల్సిన సమయం ఇది. దేశ ప్రధాని నరేంద్ర మోడి పిలుపుకు స్పందిస్తూ..  ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ను పాటిద్దాం” మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. 

ఇళ్లకే పరిమితమవుదామని, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి గుమ్మాల్లోకి వచ్చి సేవలందిస్తున్న వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిన సమయమిదని ఆయన వాఖ్యానించారు. అది మన ధర్మమని, భారతీయులుగా మనం అందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడదామని చిరు పిలుపునిచ్చారు.