కరోనాపై తెలంగాణ ప్రభుత్వం ఎంత ముందు చూపుతో ఉందో తెలుసా ?

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశం మొత్తం 12గంటలు జనతా కర్ఫ్యూని పాటిస్తుంటే.. తెలంగాణ ప్రజలు మాత్రం 24గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ కరోనా తీవ్రంగా విజృంభించినా.. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.

అవసరమైతే.. ఇంటింటికి కిరణా సరుకులు పంపిణీ చేస్తాం. ప్రజలెవరు బయటికి రాకుండా జాగ్రత్తపడతం. ఇందుకోసం సరుకులు, వాహనాలు సిద్ధంగా పెట్టినమని సీఎం తెలిపారు. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. రూ. 5000 కోట్లు కాదు.. రూ.1000కోట్లు ఖర్చుపెట్టి ప్రజలని రక్షించుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజల భోజనానికి ఇబ్బంది రానీవ్వం, మందులకి ఇబ్బందిరానీవ్వం, కేసీఆర్ బ్రతికున్నంత వరకు ప్రజలకి కష్టాలు రావు. రానివ్వం అన్నారు.