మహారాష్ట్రలో కరోనా స్టేజ్-3

దేశంలో కరోనా స్టేజ్ 2లో ఉంది. స్టేజ్ 3లోకి వెఌతే దాన్ని కట్టడి చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో కరోన వైరస్ స్టేజ్-2 దాటిపోయిందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. దేశంలో ఇప్పటికే 258 కొవిడ్‌-19 కేసులు నిర్ధారణ కాగా, మహారాష్ట్రలో దీని తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 63కి చేరింది. శనివారం ఒక్కరోజే 11 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక కరోనా స్టేజ్-1 అంటే.. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ గా తేలడం. కరోనా స్టేజ్-2 అంటే.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి మనదేశంలో వారికి సోకడం. ఇక స్టేజ్-3 అంటే ఇక్కడివారికి సోకిన వైరస్ ఇతరలకి వ్యాపించడం. అదే జరిగితే నిమిషాల్లో వేలమందికి ఈ వైరస్ వ్యాపించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మనదేశంలో కరోనాని కట్టడం చేయడం కష్టమని వైద్యులు చెబుతున్నారు.