తెలంగాణలో తొలి కరోనా కేసు

ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా లేదు. ఏ తెలంగాణ వ్యక్తికి కరోనా సోకలేదు. విదేశీయుల నుంచి వచ్చిన వారికే మాత్రమే కరోనా పాజిటివ్ తేలిందని సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల రాజేందర్ చెప్పేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. తెలంగాణ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా మరొకరికి ఈ వైరస్‌ సోకింది.

దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. శనివారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు ఈ నెల 14న వైద్యులు గుర్తించారు. అయితే అతడితో సన్నిహితంగా మెలిగిన 35 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.