జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బజార్లు
ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు బాధ్యతగా జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రధాని కోరారు. కరోనా వైరస్ కి మందు లేదు. ముందు జాగ్రత్తలే శరణ్యం. ఈ నేపథ్యంలో.. అత్యవసరం అయితేనే బయటికి రావాలి. లేదంటే ఇంట్లోనే ఉండాలని ప్రధాని సూచించారు.
జనతా కర్య్ఫూ లో పాల్గొనాలని ప్రజలు స్వచ్ఛంధంగా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజే బజార్లుకి వెళ్లి నిత్యావసర వస్తువులు కొనుకుంటున్నారు. మూడ్నాలుగు రోజులకి సరిపడా నిత్యవసర వస్తులని ఒకేసారి కొనుక్కొంటున్నారు. దీంతో హైదరాబాద్, విశాఖ తదితర నగరాల్లో బజార్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎవరైనా బ్లాక్ మార్కెట్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.