కరోనా జాగ్రత్తలు.. కవితకు వర్తించవా ?

సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత వివాదంలో ఇరుకున్నారు. కరోనాని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలని ఆకర్షిస్తున్నాయి. అయితే కవిత మాత్రం సీఎం కేసీఆర్ సూచనలు బేఖాతరు చేస్తూ.. పెద్ద పార్టీ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కవితకి ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరాస క్యాంప్ రాజకీయాలని తెరలేపింది. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌కు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించింది. పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. కవితకి కరోనా జాగ్రత్తలు వర్తించవా ? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి ఇలాంటి విషయంలో కేసీఆర్ కుటుంబం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటుంది. మరీ.. కవితకి తెలియకుండానే ఈ పార్టీ జరిగిందా ? లేదంటే స్వయంగా ఆమెనే ఈ పార్టీని ఇచ్చిందా ?? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. కరోనా కట్టడికి గొప్ప పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఇది మచ్చలాంటిదే.