కరోనాపై ప్రభుత్వ సూచనలు పాటించండి : కేటీఆర్

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ. 500కోట్లు విడుదల చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలు, థియేటర్స్ మూసివేసింది. పార్టీలు, ఫంక్షన్స్ రద్దు చేసుకోవాలని ప్రజలని కోరింది. పరీక్షలని రద్దు చేసింది. పరిస్థితిని బట్టీ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనలని పాటించాలని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.

“సామాజిక దూరం, వ్యక్తిగత నిర్భందం, వ్యక్తిగత నియమాలను పౌరులు తప్పనిసరిగా పాటించాలి. తక్షణం స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న హాంకాంగ్‌, సింగపూర్‌, జపాన్‌లు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుండగా ఇటలీ, యూఎస్‌, ఇతర దేశాలు ఏ విధంగా అల్లాడిపోతున్నాయో చూస్తున్నాం. కావునా ప్రభుత్వం సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలి” అని కేటీఆర్ రాసుకొచ్చారు.