ఐటమ్’గా మారిన హాట్ బ్యూటీ 

నిండైన అందాలు హీరోయిన్ నిధి అగర్వాల్ సొంతం. దానికి తగ్గట్టుగానే గ్లామర్ హీరోయిన్ గా రాణించాలని ఆశపడుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ‘జిల్లెలమ్మ జిట్టా.. ‘ పాటలో నిధి వేసిన స్టెప్స్ అదుర్స్. ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది నిధి. ఇప్పుడీ ముద్దుగుమ్మకి ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్టు సమాచారమ్.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది కందీరగ చిత్రానికి సీక్వెల్ అని చెబుతున్నారు. హీరో విలన్ల మధ్య చేరి వారిని ఓ ఆటాడుకొనే కథ ఇది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం నిధి అగర్వాల్ ని సంప్రదించారట. అంతేకాదు.. ఎంత ఖర్చైనా సరే ఐటమ్ సాంగ్ లో నిధితో చిందేయించాలని భావిస్తున్నారట. మరీ.. ఐటమ్ గా నిధి ఒప్పుకుంటుందా ? ఒప్పుకుంటే.. ఎంత ఛార్జ్ చేస్తోందో చూడాలి.