కనికపై పోలీస్ కేసు.. నేరం రుజువైతే 6యేళ్ల జైలు ! 

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ చేసిన నిర్లక్ష్యపు పనికి.. ఆమె పెద్ద మూల్యమే చెల్లించుకోబోతున్నట్టు తెలుస్తోంది. కనికా కపూర్ పై ఉత్తరప్రదేష్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల లండన్ వెళ్లొచ్చిన కనికా కపూర్.. ఆ విషయాన్ని దాచి పెట్టి లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నిర్వహించిన పార్టీకి హాజరయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆయన కుమారుడు భాజాపా ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా హాజరయ్యారు. పార్టీలో కనికతో కలిసి సరదాగా గడిపారు.

ఆ మరసటి రోజు ఎంపీ దుష్యంత్ సింగ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిశారు. పార్లమెంట్ సమావేశాలకి హాజరయ్యారు. ఇప్పుడు కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని క్వారంటైన్ లోకి వెళ్లనున్నారు. దుష్యంత్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్తునారు. ఇదంతా కనికా కపూర్ చేసిన నిర్లక్ష్యం పని వలన కలిగిన రచ్చ అని చెప్పాలి.

ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు కనికా కపూర్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. విషయ తెలిసినా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించినందుకు ఆమెపై ఐపీసీ సెక్షన్ 269 క్రింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే కనికకి 6యేళ్ల జైలుతో పాటు జరిమానా విధిస్తారని చెబుతున్నారు. మరోవైపు సెలబ్రేటీ అయి ఉండి.. బాధ్యతయుతంగా మెలగాల్సిన కనికాపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కనికకు సిగ్గులేదని తిట్టిపోస్తున్నారు.