కరోనా ఎఫెక్ట్.. ఉమ్మితే కూడా ఫైన్ నే !
దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పరిశుభ్రతకి పెద్దపీఠ వేస్తున్నాయి. ఈ క్రమంలో జనాలు ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే ఫైన్ పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారికి విధించే జరిమానాను రెట్టింపు చేసింది.
”ఈ నెల 31 వరకు అన్ని పాన్ మసాలా షాపులు మూసివేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే విధించే జరిమానాను రూ.500 నుంచి రూ.1000కి పెంచాం. ఇది సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. జరిమానా చెల్లించని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం..” అని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ వినయ్ నెహ్రా పేర్కొన్నారు. ఇక ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైల్స్, మెట్రో, పెట్రో బంకులు బంద్ కానున్నాయి.