జనతా కర్ఫ్యూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !
రేపు (ఆదివారం) దేశ వ్యాప్తంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రేపు ఢిల్లీ మెట్రో సర్వీసులని రద్దు చేస్తున్నట్టు క్రేజీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధాహ్నం 2 గంటలకి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో జనతా కర్ఫ్యూ నేపథ్యంలో పాటించాల్సిన సూచనలు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రోని రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అన్నీ రకాల దుకాణాలు, షాపింగ్ మాల్స్ ని స్వచ్ఛందంగా మూసేయాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పెట్రో బంకుల యాజమాన్యాలు సమావేశం అయ్యాయి. రేపు పెట్రో బంకులని బంద్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు సీఎం కేసీఆర్ కరీనంగర్ పర్యటన కూడా రద్దయింది. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందం కరీంనగర్ లో పర్యటించడం, వారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కరీంనగర్ లో కరోనా భయం పుట్టుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో ఇంటింటికి వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులని స్వయంగా వెళ్లి పరిశీలించాని సీఎం కేసీఆర్ భావించారు. అయితే, అధికారుల సూచలనతో కరీంనగర్ పర్యటనని సీఎం కేసీఆర్ రద్దు చేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 3 కేసులు నమోదయ్యాయి.