జనతా కర్ఫ్యూ.. వైన్స్ షాపులు బంద్ !

రేపు (ఆదివారం) దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించబోతుంది. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇంటి నుంచి బయటి రాకూడదు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం డబుల్ కర్ఫ్యూని పాటించబోతున్నారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు అంటే.. 24గంటలు జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ, షాపులు సకలం బంద్ చేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణలో వైన్ షాపులు కూడా బంద్ కానున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,400 వైన్ షాపులు మూతపడనున్నాయి. వైన్ షాపులు మూసివేస్తున్నట్టు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. వీటితో పాటు 700 బార్లు కూడా మూతపడనున్నాయి. వైన్స్, బార్లు ఆదివారం ఒక్కరోజే బంద్ కానున్నాయా.. ?  లేక ఈ నెల 31వరకు బంద్ చేస్తారా ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.