ఏపీ కూడా లాక్‌డౌన్

కరోనా ప్రభావంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అవుతున్నాయి. ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం ఏపీ కూడా లాక్‌డౌన్ ని ప్రకటించింది. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. అత్యవసర సరుకుల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్లాలని సీఎం జగన్ కూడా సూచించారు.

బయటి రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు 6కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలి. మరీ.. అవసరమైతే బయటికి వెళ్లండి. వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలని సీఎం జగన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటించినట్టుగా ఏపీలోనూ సకలం బంద్ అవుతాయని సీఎం జగన్ తెలిపారు.