దీపికా ఎప్పుడూ నైట్ డ్రైస్’లోనే ఉంటుందట.. ఎందుకంటే ?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఎప్పుడూ నైట్ డ్రైస్ లో ఉంటారట. ఈ విషయాన్ని కరోనా తెచ్చిపెట్టిన సెలవులు బయటపెట్టాయి. అవునూ.. కరోనా ఎఫెక్ట్ తో సెలబ్రేటీలు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. సరదగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి ఖుషి చేస్తున్నారు.
హీరోయిన్ దీపిక పదుకొనె ఇంటి దగ్గర రోజుకో పని చేస్తోంది. ఆ పనికి సంబంధించిన విశేషాలని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. మొదటిరోజు తన బట్టలని సర్ది, ఇంటిని శుబ్రపరిచినట్టు తెలిపింది. రెండవరోజు సెల్ఫ్ కేర్ అంటూ ఫేస్ వాష్ లాంటి పనుల్లో నిమగమైనట్టు తెలిపింది. ఇక మూడోరోజు ఓ పెద్ద గ్లాస్ లో పండ్ల రసం తాగుతూ ఆరోగ్యంపై దృష్టిపెట్టినట్టు చెప్పింది.
అయితే ఈ మూడు రోజులు దీపిక నైట్ డ్రెస్ లోనే ఉంది. దీనిపై యువ కథానాయకుడు వరుణ్ ధావన్ ప్రశ్నించారు. ఎందుకు మీరు ఎప్పుడూ.. నైట్ డ్రెస్ లోనే ఉంటారని ప్రశ్నించారు. దీనికి దీపిక సరదాగా సమాధానం ఇచ్చింది. ‘ఎందుకంటే నేను ఏ సమయంలోనైనా చాలా సౌకర్యంగా నిద్రపోవచ్చు’ అని చెప్పింది. ఈ ప్రశ్న-సమాధానం వెనక డబుల్ మీనింగ్ ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.