కరోనాతో మృతి చెందిన హీరోయిన్ తండ్రి
కరోనా వైరస్ కి సెలబ్రేటీ, సామాన్యుడు అనే తేడానే లేదు. వచ్చిందంటే ఇక అంతే సంగతి. ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్(67) కరోనా బారిన పడి కన్నుమూశారు. గతకొంతకాలంగా పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కరోనా కూడా సోకింది. దీంతో ఆయన కోలుకోలేకపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
తండ్రి మరణించిన విషయాన్ని సోఫియా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ”ఆర్‌ఐపీ పీటర్ మైల్స్ . మా నాన్న కొన్ని గంటల క్రితమే మరణించారు. కరోనా వైరస్ కారణంగానే ఆయన చనిపోయారు” అని తెలిపారు. ఇక కరోనా మనదేశంలోనూ రోజురోజూకి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కరోనా సోకి మనదేశంలో 7గురు మృతి చెందారు. 237మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21, ఏపీలో 3కి చేరింది.