పవన్, ఎన్టీఆర్ గంట కొట్టారు.. చరణ్ చప్పట్లు కొట్టాడు !
దేశ ప్రజలు ఐక్యతని చూపారు. మహమ్మారి కరోనా వైరస్ ని ఎదుర్కోవడం ప్రజలు చూపించిన ఐక్యత గొప్పగా ఉంది. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5గంటలకి ప్రజలందరు చప్పట్లతో వైద్యులు, స్వచ్ఛ కార్మికులు, పోలీసులు, విలేకరులని అభినందించాలని ప్రధాన నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంట్లో దేశం ఐక్యతని చూపించింది. సెలబ్రేటీస్ నుంచి సామాన్యుల వరకు అంతా బయటికొచ్చి చప్పట్లు సరిచి ఐక్యతని చాటారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గంట కొట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటి బాల్కానీలో నిల్చొని చప్పట్లు కొట్టారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రేటీలు, సామాన్య ప్రజలు చప్పట్లు కొట్టి ఐక్యతని చాటారు. బహుశా.. ఇలాంటి ఐక్యతని ఇలాంటి సమయంలో చూడలేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
We salute to all the Doctors, Nurses, health workers, sanitary workers, media and police for fighting against corona. pic.twitter.com/2KuzdVhdcx
— Pawan Kalyan (@PawanKalyan) March 22, 2020
Salute to all our brothers and sisters in healthcare and emergency services, who are selflessly leading this fight against #COVID19 pic.twitter.com/xjtVee0T0m
— Jr NTR (@tarak9999) March 22, 2020
Great feeling ! Great initiative @narendramodi ji
So proud of INDIA. JAI HIND #indiafightscorona #ramcharan pic.twitter.com/Qhjyov9FBl— Upasana Konidela (@upasanakonidela) March 22, 2020