వెంకీ, కైరా.. ఇలా కొట్టారు !
జనతా కర్ఫ్యూతో దేశ ప్రజలు ఐక్యతని చాటారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో దేశ ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సాయంత్రం 5గంటలకి ప్రధాని సూచించినట్టు ఇళ్ల నుంచి బయటికొచ్చి కఠిన సమయాల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, పోలీసులు, స్వచ్ఛ కార్మికులు, విలేకరులకి చప్పట్లు, శబ్ధాలు చేస్తూ అభినందలు తెలిపారు.
సినీ స్టార్స్ కూడా బయటికొచ్చి చప్పట్లు సరిచారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్ టీఆర్, రామ్ చరణ్, వెంకీ, బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తదితరులు చప్పట్లు సరిచారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కరోనా ఎఫెక్ తో సినిమా షూటింగ్స్, రిలీజ్ డేట్స్, సినీ వేడుకలు రద్దయిన సంగతి తెలిసిందే. కరోనా వలన వచ్చిన ఈ సెలవుల్లో సెలబ్రేటీలు కుటుంబ సభ్యులతో సరదగా గడుపుతున్నారు.
Gratitude to all you brave hearts who are out there without your families risking your life to keep us safe❤️🌍 Praying for you🙏🏼 to everyone else please stay home guys! Let’s stop the #coronavirus by staying at home so we can fight this together! Do your part #SocialDistanacing pic.twitter.com/ZN5nq21gBS
— Kiara Advani (@advani_kiara) March 22, 2020