‘లాక్‌డౌన్’పై కేటీఆర్ ట్విట్

ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు ప్రజలకి కృతజ్ఝతలు తెలిపారు. జనతా కర్ఫ్యూ పాటించడంలో ముంబై, హైదరాబాద్ నగరాలు ముందు వరుసలో ఉన్నాయనే రిపోర్ట్ వచ్చినట్టు సీఎం తెలిపారు. అదే సమయంలో  కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ లాక్‌డౌన్ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. “ఈ నెల 31వరకు తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమయంలో 87.59లక్షల తెల్లరేషన్ కార్డు దారులకి ఉచితంగా రేషన్ అందిస్తాం. దీంతోపాటు ఖర్చుల కోసం రూ. 1500 అందజేస్తాం. ప్రతి ఒక్క కుటుంబంపైనా రూ. 2,417 ఖర్చు చేస్తున్నాం”అని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.