సీఎం కేసీఆర్ ప్రకటన : ఈ నెల 31వరకు తెలంగాణ లాక్‌డౌన్

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు తెలంగాణని లాక్‌డౌన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది నోటిమాటగా చెప్పలేదు. 1897లో చేసిన చట్టం ‘వ్యాధిలు ప్రభలినప్పుడు విశేధికారాలు’ తీసుకొనే దానిక్రింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే నిత్యవసర వస్తువుల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్లాలని సూచించారు.
 
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలని రూ. 1500ఇస్తామని తెలిపారు. నెలకి సరిపడా రేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉగ్యోగులు కూడా ఇంటికే పరిమితం అవుతారు. కొందరు అత్యవసర సేవలకి సంబంధించిన వారు మాత్రం విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. ప్రయివేటు, ప్రభుత్వ రంగసంస్థలు కూడా ఈ వారం రోజుల పాటు జీతాలు చెల్లించాలని సీఎం కోరారు. మొత్తంగా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్… ఈ సమయంలో ప్రజలకి ఎలాంటి కష్ట-నష్టాలు రాకుండా చర్యలు తీసుకున్నారు.