అంతరాష్ట్ర సరిహద్దులు బంద్

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 31వరకు తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు.. రైళ్లు, బస్సులు, ఆటోలు, ప్రయివేటు వాహనాలు అన్నీ బంద్ చేస్తున్నామని తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దులని మూసేస్తున్నట్టు తెలిపారు. ఈ వారం రోజులు ప్రజలంతా ఇంటోనే ఉండాలి. కరోనా నుంచి కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇది మన బాధ్యత. అందరు పాటించాలని కోరారు.

ఇక లాక్‌డౌన్ సమయంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా నెలరోజుల రేషన్ అందిస్తామని తెలిపారు. దీంతోపాటు అత్యవసర ఖర్చుల కోసం రూ. 1500లు అందిస్తామని తెలిపారు. వీటిని ఎలా అందిస్తారానేది కొద్దిసేపట్లో చెబుతామని తెలిపారు. ఇక ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ముంబై, హైదరాబాద్ నగరాల్లో జనతా కర్ఫ్యూ బాగా జరిగిందని ఛానెల్స్ చెబుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.