ఓ వారం నియంత్రణ జీవితాన్ని కాపాడుతుంది : సీఎం కేసీఆర్

తెలంగాణ లాక్‌డౌన్ అయింది. ఈ నెల 31 వరకు తెలంగాణని లాక్‌డౌన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఓ వారం నియంత్రణ జీవితాన్ని కాపాడుతుంది. రాష్ట్రాన్ని కాపాడుతోంది. దేశాన్ని కాపాడుతుందన్నారు సీఎం కేసీఆర్. కరోనా ముందు మనిషికి వచ్చినట్టు తెలియదు. వారం రోజుల తర్వాత బయటపడితే.. ఆయన ఏం తిన్నడు. ఎక్కడ తిరిగుండు. ఏం చేసిండు అనేది తెలియదు. వారిని గుర్తించడం కష్టం. అందుకే తెలంగాణ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇటీవల సికింద్రాబాద్ లో దంపతులిద్దరు దుబాయ్ కి వెళ్లొచ్చారు. నేరుగా ఇంటికి వెళ్లారు. కొడుకికి కరోనా అంటించారు. దానికి ఎవరు బాధ్యులు. అందుకే… విదేశాల నుంచి వారు.. క్వారంటైన్ కి వెళ్లాలి. కరోనా లేదంటే వారిని తిరిగి ఇంటికి పంపిస్తారు. అవసరమైతే ఇంటికి వచ్చి వైద్య సేవలు అందిస్తారని సీఎం తెలిపారు.