ఆ పని చేసి చేసి.. అనసూయ వేళ్లు నొప్పి పెడుతున్నాయట !

సెలబ్రేటీలు ఫాలోయింగ్ పెంచుకుంటుంటారు. కానీ అనసూయ మాత్రం ఉన్న ఫాలోవర్స్ ని డిలీట్ చేస్తోండి. అలా డిలీట్ చేసి చేసి వేళ్లు నొప్పిపెడుతున్నాయట. ఇంతకీ విషయం ఏంటంటే.. ? కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 31వ వరకూ రాష్ట్రాన్ని లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందిపడుతోన్న సామాన్యులకు రూ.1500 ఆర్థికసాయం కింద అందచేయనున్నట్లు కేటీఆర్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన అనసూయ సినీ కార్మికుల పరిస్థితిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ‘సర్‌.. మీరు మరికొన్ని వృత్తులను సైతం పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మేము కనుక వర్క్‌ చేయకపోతే మాకు ఆదాయం ఉండదు. కానీ ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, ఈఎంఐలు, ఇలాంటివి కట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను మీరు పరిశీలించాలని అభ్యర్థిస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్ కి ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేసింది.

దీంతో పలువురు నెటిజన్లు అనసూయను విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ‘ఎంతో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండే మీరే ఇలా మాట్లాడితే.. సామాన్యులు ఏమైపోవాలి’ అని పేర్కొంటూ కామెంట్లు పెట్టారు. దీనిపై అనసూయ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. అనుచిత కామెంట్స్ పెట్టినవారి అకౌంట్స్‌ బ్లాక్‌ చేసింది. ‘అయ్యబాబోయ్‌!! ఏంటి ఇంతమందా!! ఇంత మంది బుర్రలేనివాళ్లా.. ఇంతమంది వితండవాదులా! ‘మేము’ అంటే ‘నేను’ అని అర్థం చేసుకుని.. ఏంచేస్తాంలేండి.. కామన్స్‌ సెన్స్‌ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాబోయే రోజుల్లో అర్థం చేసుకునేవాళ్ల గురించి నేను భయపడుతున్నా. నిన్నటి నుంచి ట్విటర్‌, ఇన్‌స్టాలో అకౌంట్స్‌ బ్లాక్‌ చేసి చేసి వేళ్లు నొప్పిపుడుతున్నాయంటే నమ్మండి.. తప్పదు కదా.. నా పేజ్‌లో వాళ్ల బుర్రలేనితనం ఏంటి.. నన్ను అర్థం చేసుకోని వాళ్లని నేను అర్థం చేసుకుని.. దూరంగా పెడుతున్నా’నని రాసుకొచ్చింది.