నాన్ వెజ్ ప్రియులకి గుడ్ న్యూస్ !
తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన స్పూర్తిని లాక్‌డౌన్ పాటించడంలో చూపించడం లేదు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తోంది. మధ్యాహ్నం వరకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత.. బయటికొచ్చిన వారిపై కీలక చర్యలు తీసుకొనే విధంగా ప్రకటన చేయనున్నట్టు సమాచారమ్.
ఇక లాక్‌డౌన్ లో భాగంగా నిత్యవసర సేవలు తప్ప.. మిగితావన్నీ బంద్ అయ్యాయ్. అయితే చికెన్, మటన్ అమ్మకాలు జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నుంచి కోలుకోవడానికి పోషక పదార్థాలు అవసరం. నాన్ వెజ్ తీయాలి. ఇందుకోసం చికెన్, మటన్ షాపులు తెరచే ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. నాన్ వెజ్ అమ్మకాలు జరిగితే.. కూరగాయల ధరలు తగ్గుతాయనే ఉద్దేశంతోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.