లాక్‌డౌన్‌ అరుదైన చర్య.. అర్థం చేసుకోండి : కేటీఆర్

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 19రాష్ట్రాలులాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే ప్రజలు లాక్‌డౌన్‌ ని లైట్ తీసుకోవడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్‌డౌన్‌పై ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు.

“LOCK OUT అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య. ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలి. నువ్వు బ్రతకడానికి, తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి  ఈ వైరస్ అంతమయ్యే వరకు  స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే”అని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.