లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కూరగాయల రేట్లకి రెక్కలు !
కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి. ఈ నెల 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్ కానున్నాయి. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యవసర వస్తువులకి రెక్కలు వచ్చాయ్. ముఖ్యంగా కూరగాల ధరలు మూడు, నాలుగు రెట్లు పెరగడంతో ప్రజలు షాక్ కి గురవుతున్నారు.
నిన్నామొన్నటి వరకు రూ. 20కిలో పలికిన టమాటా ఇప్పుడు రూ. 80 పలుకుతోంది. 10రూపాయల కోతిమీర కట్ట రూ. 40 పలుకుంది. ఆలుగడ్డ రూ. 40కిపైగా, బీర రూ. 80కిపైగా ఇలా.. కూరగాయాల రేట్లకి రెక్కలొచ్చాయ్. లాక్‌డౌన్ ప్రకటించిన తొలిరోజునే పరిస్థితి ఇలా ఉంటే ఇంకో మూడ్నాలుగు రోజులు గడిస్తే.. మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో నిత్యవసర వస్తువుల ధరల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.