కరోనా కట్టడి కోసం రిలయన్స్ సైతం
కరోనా మహమ్మారిపై యుద్ధంలో వ్యాపార వేత్తలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆనంద్ మహీంద్రా వెంటిలేటర్ల తయారీ చేపడుతున్నామని, బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కట్టడిచేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం రంగంలోకి దిగింది. రోజుకు లక్ష ఫేస్‌మాస్క్‌లు ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.
కొవిడ్-19 పేషెంట్లను తరలించే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తామని తెలిసింది. లాక్‌డౌన్ కారణంగా వివిధ నగరాల్లోని చాలా మంది జీవనాధారం కోల్పోతారు కాబట్టి వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని తెలిపింది. ముంబయి ఆస్పత్రిలో 100 పడకలను సిద్ధం చేశామని రిలయన్స్ వెల్లడించింది. సంక్షోభంలో పనులు ఆగిపోయినా తమ సంస్థలో పనిచేసే ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని తెలిపింది. ఇక మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 415కు చేరింది. క తెలంగాణలో కరోణా కేసుల సంఖ్య 30కి చేరింది. దేశంలో 19 రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించాయి.