బ్రేకింగ్ : మరికొద్దిసేపట్లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్ ప్రమాణం

మధ్యప్రదేష్ లో వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భాజపా భావిస్తోంది.ఆ పార్టీ సీనియర్‌ నేత శివరాజ్‌ సింగ్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోగా బలం నిరూపించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ముందుగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిపోయారు.  ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రామాన్ని వేడుకగా చేసుకొనే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఈ నేపథ్యంలో చాలా సింపుల్ గా శివరాజ్‌ సింగ్ ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.