ధరలు పెంచారని.. కూరగాయలని ఎత్తుకెళ్లారు !
లాక్‌డౌన్ తో తెలంగాణలో కూరగాయల ధరలకి రెక్కలొచ్చాయ్. ఏది ముట్టుకున్న మండిపోతుంది. ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయ్. ఏ కూరగాయలు అయినా కి.లో వంద రూపాయలకిపైనే. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ లో దొరికకాడికి కూరగాయలని ఎత్తుకెళ్లారు. ధరలు పెంచుతారా.. ? దోచుకెళ్తామని ఎత్తుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 415కి చేరింది. ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. ఏపీలో నాలుగు కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 19 రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే ప్రజలు లాక్‌డౌన్ ని సీరియస్ గా తీసుకోకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ప్రజలు బయటికొస్తే.. భారీగా ఫైన్ వేస్తామని హెచ్చరిస్తున్నారు.