కరోనాపై ఎటాక్ చేయాల్సిందే 

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 16 వేలు దాటగా.. బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 492 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కరోనాపై డిఫెండ్‌ సరిపోదు. ఎటాక్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది.

కరోనా వైరస్ డిసెంబర్‌లో వెలుగులోకి వచ్చింది. వైరస్‌ బాధితుల సంఖ్య లక్ష చేరుకోవడానికి 67 రోజులు పట్టిందని టెడ్రోస్‌ తెలిపారు. అదే రెండో లక్షను తాకడానికి 11 రోజులు, మూడో లక్షను దాటడానికి కేవలం నాలుగు రోజులే పట్టిందని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. ఫుట్‌బాల్‌ ఆటలో కేవలం డిఫెండ్‌ మాత్రమే కాకుండా అటాక్‌ కూడా చేస్తేనే గెలుస్తామని అదే స్ఫూర్తితో కరోనాపై కూడా పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ట్రెడ్రోస్‌ అధనోమ్‌ అన్నారు.