చంద్రబాబు ఉడత సాయం

‘మాటలు కోటలు దాటుతాయి. కానీ, చేయి జేబు దాతదు’ అంటే ఇదేనేమో. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత కరోనా సాయం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌ కు తనవంతు సాయంగా రూ.10 లక్షలు ప్రకటించారు. అంతేకాదు.. సొంత పార్టీ నేతలతో కరోనా సాయం చేశారు. ఇది బాగానే ఉన్నా.. చంద్రబాబు స్థాయికి, స్థానానికి ఇది చాలా తక్కువ. ఆయన భారీ మొత్తంలో సాయం చేసి ఉండాల్సిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ?

టాలీవుడ్ లో ఓ మీడియం రేంజ్ హీరో అయిన నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకి రూ. 10లక్షల చొప్పన ఆర్థిక సాయం చేశారు. అది కూడా ఆయనే తొలుత ముందుకొచ్చి సాయం చేశారు. కానీ చంద్రబాబుది 40ఇయర్స్ ఇండస్ట్రీ. ఏకంగా మూడ్నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి చంద్రబాబు కరోనా సాయం కోసం జేబు నుంచి రూ. 10లక్షలే తీయడంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రకటించిన రూ. 10లక్షలు కూడా బాగా ఆలోచించి తీసినట్టున్నాడు.. !