నితిన్ టైమింగ్ అదిరింది

నటీనటులకి టైమింగ్ అన్నది చాలా ముఖ్యం. అప్పుడే గొప్ప నటి, నటుడు అనిపించుకొంటారు. కరోనాపై హీరో నితిన్ టైమింగ్ అదిరిందని చెప్పవచ్చు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ ప్రభావంతో దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. మనదేశం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెక్కాడితే గానీ డొక్కాడని వారి పరిస్థితి భయంకరంగా మారే పరిస్థితి. ఇలాంటి సమయంలో హీరో నితిన్ ముందుకొచ్చారు.

తనవంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 10లక్షలు విరాళం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకి ఇచ్చారు.
నితిన్ దారిలో మరికొందరు ముందుకొచ్చి.. సాయం చేస్తున్నారు. ఫలితంగా కష్ట సమయంలో పేదలకి అండగా నిలిచినట్టు అవుతోంది. ఇక మంగళవారం నితిన్ సీఎం కేసీఆర్ ని కలిసి చెక్ ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నితిన్ ని హత్తుకొని అభినందించారు. ఇక్కడ నితిన్ చేసిన సాయాన్ని పొగడటం కాదు. ఆయన టైమింగ్ ని మెచ్చుకోవాల్సిందే.