వారికి సాయం చేయండీ : కేటీఆర్

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకొంటున్నాయి. ఈ నెల 31 వరకు విధించిన లాక్‌డౌన్‌ ని వచ్చే నెల 14 వరకు పొడిగించారు. తప్పక ఈ నిర్ణయం తీసుకొన్నాం. 21 రోజులు లాక్‌డౌన్‌ చేయకుంటే 21 యేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయాల్లో జీవనం కొనసాగించలేని పరిస్థితి కొందరికి.

వారికోసం మంత్రి కేటీఆర్ ఓ పిలుపునిచ్చారు. కలిగిన వారు పెద్ద మనసు చేసుకొని తమ తమ పరిధిలో క్యాబ్/ఆటో డ్రైవర్స్ తదితరులని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కఠిన కాలంలో తమవంతుగా సాయం చేసేందుకు ఇప్పటికే పలువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. హీరో నితిన్ రూ. 10లక్షల విరాళం ప్రకటించారు. ఆయన దారిలో పలువురు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకొంటున్నారు.