కేంద్రం సంచలన నిర్ణయం : మరో 21 రోజుల పాటు లాక్‌డౌన్
దేశంలో కరోనా కట్టడికి కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు మాత్రమే లాక్‌డౌన్ కాదు… ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ కొనగిస్తామని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
లాక్‌డౌన్ అంటే కర్ఫ్యూ లాంటిదే. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ఇదే పరిష్కారమని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధానిగా చెప్పడం లేదు.. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చెప్తున్నానన్నారు.