21డేస్ లాక్‌డౌన్ పై పవన్ కామెంట్స్
“ప్రధాని మాట పాటిద్దాం-కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం” అని పిలుపునిచ్చారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ కరోనాపై రెండోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని.. అలా జరగకపోతే 21 సంవత్సరాలు వెనక్కి వెళతాం. అందుకే మరో 21 రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. దీనిపై పవన్ స్పందించారు.
“అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధాని నరేంద్ర మోడీగారు చెప్పినట్టుగా.. ఈరోజు అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యే 21 డేస్ లాక్‌డౌన్ ని అందరు విధిగా పాటించాల్సిందిగా మనస్పూర్తిగా కోరుతున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన సలహాలు, సూచనలు విధిగా అందరు పాటించి తీరాలి. వేరే దారి లేదు దీనికి. దయచేసి అందరు ఇంటికే పరిమితంకండి. బయటికిరావొద్దు ఎవరు. నిజంగా ప్రాణాల మీదికి వస్తే మట్టుకు ఎమర్జిన్సీ సర్వీసులకి ఫోన్ చేయండి” అని కోరుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు.
ప్రధాని మాట పాటిద్దాం – కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం…
Please follow 21 days lock out.. pic.twitter.com/Ep8qFvGIf2— Pawan Kalyan (@PawanKalyan) March 24, 2020