మీ వాహనం 3కి.మీ దాటితే.. ఆటోమాటిక్ ఫైన్ !

దేశంలో లాక్-డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు లాక్-డౌన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. లాక్-డౌన్  పాటించకుండా బయటికొచ్చే వారికి ఆటోమేటిక్ గా ఫైన్ పడే ప్లాన్ చేశారు. నిత్యవసర సరుకుల కోసం 3కి.మీ వరకు వెళ్లే అనుమతిని ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకుమించి వెళీతే మాత్రం ఫైన్ పడినట్టే.

“లాక్-డౌన్ అమలులో ఉన్న దృష్ట్యా, మీ వాహనం గనక 3కి.మీ దాటినట్టయితే, ఫైన్ వేయబడుతుంది. అన్ని సీసీటీవీ కెమెరాలు, ఆటోమాటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాంకేతికతతో (కృత్రిమ మేధస్సుతో) అనుసంధానించబడినవి. దయచేసి, ఇంటి వద్దనే ఉండండి, విధులలో ఉన్నవారిని గౌరవించండి” అని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్ చేశారు.