పూరిపై చిరు బీచ్ సటైర్స్ 

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాధి పర్వదినాన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాలని తెరిచారు చిరు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగాస్టార్ కి ఘన స్వాగతం లభిస్తోంది. చిరుకి స్వాగతం పలుకుతూ పలువురు ట్విట్ చేస్తున్నారు. ఈ జాబితాలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. 

“సోషల్ మీడియాలోకి స్వాగత సర్. సామాజికి దూరం పాటిస్తున్న సమయంలో సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుంది” అని పూరి ట్విట్ చేశారు. దీనికి చిరు రిప్లై ఇచ్చారు. పూరికి థ్యాంక్స్ చెబుతూనే సటైర్స్ వేశారు. కరోనా ఎఫెక్ట్ తో మంచి ఫ్యామిలీ టైం లభిస్తోంది. బహుశా.. నీవు ముంబై, బ్యాంకాక్ బీచ్ లని మిస్ అవుతుంటావు. కానీ పవిత్ర, ఆకాష్ నీతో సమయం గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు” అని చిరు రాసుకొచ్చారు. ఇప్పుడీ ట్విట్ వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేసేందుకు పోటీ పడిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరి. చిరు కోసం పూరి ఆటోజానీ కథని రెడీ చేశారు. అది చిరుకి నచ్చింది. కానీ సెకాంఢాఫ్ విషయంలో చిరు సందేహాలు వ్యక్తం చేయడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే, భవిష్యత్ లో కచ్చితంగా మెగాస్టార్ తో సినిమా చేస్తానని పూరి నమ్మకంతో ఉన్నారు.