ఫుడ్ డెలవరీ చేసుకోనివ్వండి : డీజీపీ

లాక్‌డౌన్‌ ని అమలుచేసే క్రమంలో తెలంగాణ పోలీసులు స్క్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. చెబితే విననివారికి నాలుగు తగిలిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బయటికొస్తే పోలీసులు కొడతారనే భయంతో జనాలు ఇంటికే పరిమితం అవుతున్నారు. అదీ మంచిదే. అయితే ఫుడ్ డెలవరీ బాయ్స్ ని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో వంట చేసుకొనే వెసులుబాటు లేనివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీనిపై స్పందించిన డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఇకపై ఫుడ్ డెలవరీ బాయ్స్ ని వదిలిపెట్టాలని ఆదేశిస్తూ అన్నీపోలీస్ కమిషనరేట్స్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశారు. ఇక లాక్‌డౌన్‌ నుంచి మీడియా, వైద్యులు, స్వచ్చ కార్మికులు.. తదితరులకి మాత్రమే ప్రభుత్వం మినహాయింపుని ఇచ్చిన సంగతి తెలిసిందే.