అనూ.. అది నిజమా ?
ఆఫర్లు వచ్చినప్పుడు అనిగిమణిగి ఉండాలి. అలా కాదని టెక్కు చూపిస్తే అను ఇమ్మాన్యూయేల్ లా అయిపోతారని ఇండస్ట్రీలో చెప్పుకొంటుంటారు. ఎందుకంటే ? ఆరంభంలో అనుకి మంచి ఆఫర్లు వచ్చాయ్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల నుంచి పిలుపులొచ్చాయ్. పవన్ కల్యాణ్ ‘అజ్ఝాతవాసి’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’లో అను హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో అనుకి పెద్ద దెబ్బతగిలింది.
దానికి తోడు అప్పటికే అను టెక్కురానీ అనే ముద్రపడిపోయింది. సినిమా షూటింగ్స్ లో అను పొగరు చూపించేదట. నిర్మాతలకి, ఆమె దగ్గర పనిచేసే వాళ్లకి చుక్కలు చూపించదట. నటనలోనూ బీభత్సం అనిపించుకోలేదు. దీంతో ఆమెని పక్కనపడేశారు. ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్య కాస్త టెక్కు తగ్గించుకొని ఈ మధ్య మళ్లీ లైమ్ లోకి వచ్చింది. పారితోషికంతో పనిలే. ఆఫర్ ఇవ్వండి చాలనే సంకేతాలు పంపింది. ఈ క్రమంలో ’18 పేజెస్’లో అను ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారమ్.
నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. సుకుమార్ కథ, స్ర్కీన్
ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టిని ఎంపిక చేసినట్టు గతంలో వార్తలొచ్చాయ్. ఇప్పుడు ఆ స్థానంలో అను ఇమ్మాన్యుయేల్ పేరు వినిపిస్తోంది. నిజంగానే 18 పేజెస్ కోసం అనుని సంప్రదించారా ? అనే విషయం తెలియాల్సి ఉంది.