‘భీమ్ ఫర్ అల్లూరి’ ఆమోఘం.. అద్భుతం !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం దొర అల్లూరి సీతారాజుగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇందులో అల్లూరిగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు స్వాత్రంత్య్ర సమరయోధుల మధ్య ఉన్న కామన్ పాయింట్ తో ‘ఆర్ఆర్ఆర్’ని తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి.

శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఆర్ఆర్ఆర్ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. భీమ్ ఫర్ రామరాజు పేరిట విడుదల చేసిన ఓ టీజర్ లాంటి వీడియో అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే అద్భుతంగా ఉంది. తారక్ వాయిస్ ఓవర్ తో రామరాజు పాత్రలో చరణ్ వీరత్వం, ధీరత్వం చూపించే ప్రయత్నం చేశారు. చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేలా ఉంది.

“ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుటది. కలవడితే ఏగుసుక్క ఎగబడినట్టుటది. ఎదురువడితే సావుకైన చెమట దారకడటది. ప్రాణమైన, బందుకైనా వానికి బాన్ చన్ అయితది. ఇంటిపేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న మన్యందొర అల్లూరి సీతారామరాజు” అంటూ ఘనంగా పరిచయం చేశారు తారక్.