తెలంగాణ కర్ఫ్యూ పొడగింపు

తెలంగాణ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 31
వరకు రాత్రి కర్ఫ్యును విధించారు. 31 తర్వాత కూడా కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి వరకు రాత్రి కర్ఫ్యూని పొడగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు రాష్ట్ర పరిస్థితులని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ అంశాలపై చర్చించారు. రాత్రి కర్ఫ్యూని మరిన్ని రోజులు పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 45కి చేరింది.