ఐసీసీ అత్యవసర సమావేశంలో ఏం చర్చించారంటే ?

కరోనా ఎఫెక్ట్ తో క్రికెట్‌ సిరీసులన్నీ వాయిదా పడ్డాయి. టీ20 ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలపై సభ్య దేశాలతో శుక్రవారం ఐసీసీ సమావేశం నిర్వహించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీసీఐ ప్రతినిధిగా అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పాల్గొన్నారు.

పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ జట్లు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది.  ఇంగ్లాండ్‌ మూడు సిరీసులు ఆడాలి. ఇవన్నీ రద్దయితే టెస్ట్ ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారన్న అంశం చర్చకి వచ్చిందని తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌ గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించలేదని ఐసీసీ తెలిపింది. జూన్‌, జులై వరకు సమస్య తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.