బాహుబలి కరోనా సాయం రూ. 4కోట్లు
బాహుబలి ప్రభాస్ కరోనా సాయంలోనూ పెద్ద చేయి చూపించాడు. కరోనా కట్టడి కోసం ప్రభాస్ తనవంతుగా రూ. 4కోట్ల సాయం ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించిన భారత దేశంలో ఏకైక నటుడు ప్రభాస్ కావడం విశేషం. ఈ రూ.4కోట్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధికి రూ 50 లక్షలు చొప్పున, మిగతా మూడు కోట్ల రూపాయలు ప్రధాన మంత్రి సహాయ నిధికి అందజేయనున్నాడు. ప్రభాస్ స్థాయిలోనే కాదు.. సాయం చేయడంలోనూ పెద్దోడని నిరూపించుకున్నాడని నెటిజన్స్ మెచ్చుకొంటున్నారు.
వాస్తవానికి ప్రభాస్ టాలీవుడ్ నెం.1 స్థానాన్ని దాటిపోయాడు. బాహుబలితో ఇంటర్నేషనల్ హీరోగా ఎదిగాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహోపై మిక్సిడ్ టాక్ వచ్చినా.. బాలీవుడ్ లో ఏకంగా రూ. 150కోట్లు కలెక్ట్ చేయడం ప్రభాస్ రేంజ్ కి నిదర్శనం. ప్రస్తుతం రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతోంది. ఇదో ప్రేమకథా చిత్రమ్. పూజా హెగ్డే హీరోయిన్. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుంది. ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.