హీరోయిన్స్ సాయం చేయరా ?
‘మొహం మాత్రమే అందం. మాట మాత్రమే స్వీటు. మనసు మాత్రం కఠినం’ ఇప్పుడు మన టాలీవుడ్ హీరోయిన్స్ ని చూస్తే ఇదే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు కోరోనా కోరల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కఠిన సమయాన మేము ఉన్నామంటూ మన హీరోలు ముందుకొస్తున్నారు. నిర్మాతలు ముందుకొస్తున్నారు. కరోనా కట్టడి కోసం తోచిన సాయం చేస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం పైసా తీయడం లేదు. తమవంతు కరోనా సాయం అంటూ ఒక్కరు ప్రకటించడం లేదు.
సినిమాలు, వాటి ప్రమోషన్స్ లో మాత్రం.. అభిమానులే మా దేవుళ్లు. వారికోసం కోసుకొంటాం. ఇకేమైనా చేస్తం అంటారు. సినిమాకో కోటిరూపాయలు తీసుకొంటారు. కానీ కఠిన సమయంలో మాత్రం వారికి అభిమానుల మీద, జనాల మీద కనికరం కలుగదు. ఏ స్టార్ హీరో ఎంత కరోనా సాయం చేస్తున్నాడు ? అనే లెక్కలే చూసుకుంటున్నారు. కానీ ఎవరైనా హీరోయిన్స్ గురించి అడుగుతున్నారా ? లేదు.. ఎందుకంటే ? దీపం ఉండగానే ఇళ్లు సర్థుకోవాలనే హీరోయిన్స్ కి ఏం సాయం చేస్తారనే భావనేమో.. !
కరోనా సాయం చేసేందుకు ముందు రాలేదు. కానీ కరోనా జాగ్రత్తలు చెబుతూ ఒకరిద్దరు హీరోయిన్స్ బైట్స్ ఇచ్చారు. మరీ.. దానికి కూడా పారితోషికం తీసుకున్నారో.. లేక ఫ్రీగా చేశారో తెలీదు. హీరోలు కోట్లు, లక్షల్లో కరోనా సాయం చేస్తున్నారు. అంత వీలుకాకుంటే.. హీరోయిన్స్ వేలలో సాయం చేయొచ్చు కదా.. ! అసలే పట్టనట్టు ఉంటే ఎలా ? ఇకనైనా హీరోయిన్స్ గొప్ప మనసు చేసుకోండి. సాయం చేయండి. మిమ్మల్నీ దేవతల్ని చేసిన జనాలు బాధలో ఉన్నారు. ఆదుకోండి.