పదో తరగతి విద్యార్థులు.. నేరుగా ఇంటర్ లోకి ప్రమోట్ !
కరోనా ఎఫెక్ట్ తో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1 నుంచి 9 వ తరగతి విద్యార్థులకి ఎగ్జామ్స్ లేకుండానే పై తరగతికి ప్రమోట్ అయ్యేలా పలు రాష్ట్రలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థులని నేరుగా ఇంటర్ లోకి ప్రమోట్ చేయాలనే డిమాండ్ వినబడుతోంది.
పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఇంటర్లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్ కోరారు. మరీ.. ఈ డిమాండ్ పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.