బన్నీకి 17యేళ్లు.. అభిమానుల సంబరాలు ! 

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి 17యేళ్లు నిండాయ్. బన్నీ మొదటి చిత్రం ‘గంగోత్రి’ 2003 మార్చ్ 28న విడుదలైంది. నేటితో 17యేళ్లు పూర్తయ్యాయ్. ఈ సందర్భంగా బన్నీ అభిమానులు పండగ చేసుకొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బన్నీ అరుదైన ఫోటోలు, వీడియోలని షేర్ చేస్తున్నారు. మనం యాక్టర్స్, డ్యాన్సర్స్, స్టార్స్ ని చూస్తాం. కానీ బన్నీ ఐకాన్ అని కితాబిస్తున్నారు.

17యేళ్లలో అల్లు అర్జున్ 19 సినిమాలు పూర్తి చేశాడు. ఆయన 19వ సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా రూ. 200కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్దులని బ్రేక్ చేసింది. ఇక బన్నీ 20వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ టైటిల్ ని ఫిక్స్ చేశారు.