కరోనా వెబ్ సైట్స్ డేంజర్.. వాటిని ఓపెన్ చేయకండి !
సైబర్ నేరగాళ్లు కరోనా వైరస్ ని కూడా వదలడం లేదు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారి గురించి తెలుసుకొనేందుకు యువత గూగుల్‌లో వెతుకుతున్నారు. అందుకు సంబంధించిన ఆర్టికల్స్‌ను కూడా చదువుచున్నారు. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు కూడా అదే రూట్‌లో వల వేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ మెయిల్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వాటిని హ్యాక్ చేసేందుకు కరోనా వైరస్ పేరుతో వెబ్‌సైట్‌లు రూపొందించి యువతకు వల వేస్తున్నారని సైబర్ పోలీసులు తెలిపారు. coronavirursstatus(.)space, coro navirus(.)zone, coronavir s-realtime(.com) bgvfr.coro navirusaware(.)xyz ఇవి చాలా డేంజరస్ డొమైన్స్ అని వీటిని క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.