అనసూయ మెగా ఐటమ్ ?


కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావంతో ఆచార్య షూటింగ్  కి బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆచార్యలో అనసూయ పాత్ర గురించి షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో అనసూయ ఐటమ్ సాంగ్ లో కనిపించనుందట.

వాస్తవానికి ఆచార్యలో స్పెషల్ సాంగ్ కోసం యంగ్ హీరోయిన్ రెజీనాని తీసుకొన్నారు. ఇప్పటికే ఆమెపై సాంగ్ ని చిత్రీకరించారు. రెజీనా డ్యాన్స్ కి మెగాస్టార్ ఫిదా అయ్యారు. ఆమెని అభినందించారు అనే వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో అనసూయ మెగా ఐటమ్ అనే ప్రచారం జరుగుతోంది. మరీ.. ఇందులో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది. బహుశా.. రెజీనా, అనసూయలతో చెరో ఐటమ్ సాంగ్ చేయిస్తున్నారేమో..!