వస్తున్నారు.. అంటిస్తున్నారు.. బాధ్యత లేదా ?
కరోనా వైరస్ మనదేశలో పుట్టింది కాదు. చైనాలో పుట్టింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలని వ్యాపించింది. ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇప్పుడు అసల సమస్య ఇటీవల విదేశాల నుంచి వారితోనే. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నవారు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండటం లేదు. హాయిగా బయట తిరుగుతున్నారు. ఇతరకు కరోనా అంటిస్తున్నారు.
ఇటీవల విదేశాల నుంచి హైదరాబాద్ కి వచ్చినవారు పదివేలకుపైగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు వారందరి సమాచారాన్ని తీసుకుని తనిఖీలు చేశారు. ఇంటింటికి తిరిగి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇల్లు దాటి బయటకు రావొద్దన్న సందేశం ఇచ్చారు. ఫలానా తేదీ వరకు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని చేతిపై ముద్ర వేశారు. ఇంటి తలుపు మీద హెచ్చరిక నోటీసునూ అంటించారు. అయితే వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోన్నారు. ఏదో ఓ సమయంలో బయటకు వెళ్తున్నట్లు తేలింది.
గత మూడు రోజుల్లో అలాంటి 16 మంది ఉల్లంఘనదారులను స్థానికుల సమాచారంతో జీహెచ్‌ఎంసీ అదుపులోకి తీసుకుంది. వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించింది. ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించిన వారిలో కూకట్‌పల్లి జోన్‌కు చెందిన ఆరుగురు, చార్మినార్ నుంచి ఐదుగురు, శేరిలింగంపల్లి జోన్‌లోని నలుగురు, ఖైరతాబాద్ జోన్‌లోని ఒకరు ఉన్నారు.