‘రామరాజు ఫర్ భీమ్’ ఎప్పుడంటే ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇందులో అల్లూరిగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు స్వాత్రంత్య్ర సమరయోధుల మధ్య ఉన్న కామన్ పాయింట్ తో ‘ఆర్ఆర్ఆర్’ని తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి. శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన లుక్ ని విడుదల చేశారు. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట తారక్ చేతుల మీదుగా విడుదల చేసిన వీడియో అదిరిపోయింది.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో రామరాజుగా రామ్ చరణ్ యాక్షన్ అదిరిపోయింది. రాజమౌళి మరోసారి అద్భుతం చేయబోతున్నారని ‘భీమ్ ఫర్ రామరాజు’ తేల్చేసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అభిమానులంతా ఎదురుచూసేది ఎన్ టీఆర్ లుక్ కోసం. అదెప్పుడు అంటే.. ? తారక్ బర్త్ డే కానుకగా మే 20న అంటున్నారు. తారక్ ఫస్ట్  లుక్ ని కూడా ‘రామారాజు ఫర్ భీమ్’ పేరిట రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాని కోసం తారక్ బర్త్ డే (మే 20) వరకు ఆగాల్సిందే.